TG: నూతన విద్యా విధానంపై CM రేవంత్ రెడ్డి సమీక్షించారు. ‘అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగట్లేదు. ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు వస్తున్నారు. వారిలో 15 శాతం మందికే ఉద్యోగాలు వస్తున్నాయి. విద్యాశాఖకు రూ.21 వేల కోట్లు కేటాయిస్తే.. 98 శాతం జీతాలకే పోతోంది. విద్యా విధానంలో మార్పులు తీసుకురావడమే నా ధ్యేయం’ అని రేవంత్రెడ్డి తెలిపారు.