NLR: బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటన ఆత్మకూరు మండలంలో బుధవారం జరిగింది. బస్సులో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో నబ్బీనగరం వద్ద ఆపలేదు. ఆగ్రహించిన ప్రయాణికులు డ్రైవర్‌పై దాడి చేశారు. బాధితుడు ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.