KMR: భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా KMR బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో KMR ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి రక్తదానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. దేశానికి ప్రధానిగా, గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఎనలేని సేవలు చేశారని, భారత దేశాన్ని విశ్వగురువుగా నిలపడానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు.