CTR: నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం చిత్తూరులో వీధి శునకాలకు స్టెరిలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని కమిషనర్ నరసింహ ప్రసాద్ ప్రజారోగ్యం విభాగంను ఆదేశించారు. వాహనాల షెడ్డులో ఏర్పాటు చేసిన యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ను ఆయన తనిఖీ చేశారు. వీధిశునకాల శస్త్ర చికిత్సల సంఖ్యను పెంచాలన్నారు. నెలకు 250 వీధి శునకాలకు ఆపరేషన్లు చేసి రేబిస్ వ్యాక్సిన్ వేయించాలన్నారు.