ప్రకాశం: మున్సిపల్ కార్మికులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. ఇవాళ స్థానిక మున్సిపాల్ కార్యాలయంలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు బూట్లు, మాస్కులు, హ్యాండ్ గ్లౌసెస్ను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, తదితరులు పాల్గొన్నారు.