MHBD: హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకి చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఇతర ముఖ్య నేతలు KTR తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరువీరుల త్యాగాలను వారు స్మరించుకున్నారు.