KRNL: గ్రామాల్లో పరిశుభ్రతపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీపీవో తిమ్మక్క హెచ్చరించారు. ఇవాళ కనకవీడు గ్రామంలో పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరుగా సేకరించాలన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యదర్శులకు సూచించారు.