VZM: కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం రైతు సేవ కేంద్రంలో యూరియా సరఫరాను బుధవారం ఎం.పీ.ఈ.వో లక్ష్మి పంపిణీ చేశారు. యూరియాను తీసుకోవడానికి చుట్టూ ప్రక్కల గ్రామాల రైతులు ఉదయం నుంచి రైతు సేవ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో యూరియా కేంద్రాల వద్ద ఎటువంటి ఉద్రిక్తతలు జరగకుండా ముందుస్తు చర్యలలో భాగంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.