VZM: నెల్లిమర్ల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతిగృహం, మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్ నెల్లిమర్లలో ఉన్న హాస్టల్స్లను జిల్లా జడ్జి ఎం బబిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదులను, స్టోర్ రూమ్లను పరిశీలించారు. విద్యార్థులతో వారికి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.