శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలో తపాల వినియోగదారుల వ్యక్తిగత సమస్యలపై తపాల అదాలత్ నిర్వహించబడనుందని పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 22వ మధ్యాహ్నం 2 గంటలకు రెళ్ల వీధిలోని సూపరింటెండెంట్ కార్యాలయం ఉంటుందన్నారు. తపాల సేవలకు సంబంధించిన ఫిర్యాదులు ఈ అదాలత్లో పరిష్కరిస్తామన్నారు.