TPT: త్వరలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రకాల వాహన సేవలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వినియోగించే సూర్య ప్రభవాహనం పటిష్టతను పరిశీలించేందుకు TTD అధికారులు బుధవారం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.