నేను నవీనా, ఓ ట్రాన్స్ మహిళ. ఎన్నో సంవత్సరాలు మా సమాజానికి గౌరవం, జీవనోపాధి దూరమైంది. కానీ..ఇప్పుడు GHMC, NGOల సహకారంతో ఉచిత ఉపాధి శిక్షణలు అందించబడుతున్నాయి. నేను చందానగర్ కమ్యూనిటీ స్కిల్ సెంటర్లో గ్రాఫిక్ డిజైన్ కోర్సు జాయిన్ అయ్యాను. కోర్సులో రూ.12,000 అందిస్తూ, ఇంటర్న్షిప్ అవకాశం వచ్చింది. ఈ రోజు నేను ఆత్మవిశ్వాసం, గౌరవంతో ఉన్నట్లు HIT TVతో తెలిపారు.