TG: గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా తన పదవికి రాజీనామాపై తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పదవి చేపట్టిన నాటి నుంచి నేటి వరకు తాను సరిగా పనిచేయలేదని గ్రాడ్యుయేట్స్ చెప్తే రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. బీసీ వర్గాల తరఫున చట్ట సభలో పోరాడాలని చెప్తే ఎమ్మెల్సీగా కొనసాగుతానని తెలిపారు.