NLG: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఫలితంగా పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేయబడిందని సీపీఎం సీనియర్ నాయకులు బొంతల చంద్రారెడ్డి అన్నారు. చిట్యాల మండలం వెలిమినేడులో బుధవారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా పోరాట దళ సభ్యుడు ఫైళ్ళ మల్లారెడ్డి స్మారక స్థూపం వద్ద ఆయన జెండాను ఆవిష్కరించారు.అనంతరం పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.