WNP: జిల్లాలోని ఫకీర్, దూదేకుల, ఇతర అట్టడుగు ముస్లిం వర్గాల మహిళలకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ. లక్ష వరకు 100 శాతం సబ్సిడీతో మోపెడ్లు, బైకులు, ఈ-బైకులు అందజేయనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అబ్జలుద్దీన్ తెలిపారు. అర్హులైన వారు అక్టోబర్ 6 వరకు ప్రత్యేక పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.