కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ‘X’ వేదికగా పోస్టులు పెట్టారు.