VZM: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన ఫ్రీ బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్ల కుటుంబం రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయనగరం రోడ్డులో ఉన్న ఆటో యూనియన్ నాయకులు బుధవారం కొత్తవలస కూడలిలో మానవహారం చేపట్టి, ట్రాఫిక్‌ను అరగంటసేపు దిగ్బంధం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని నిరసనతో హోరెత్తించారు. బి.రమణ ఆద్వర్యంలో ఈ కార్యక్రమన్ని చేపట్టారు.