మేడ్చల్: ప్రజాపాలన దినోత్సవ వేడుకలు రాచకొండ పోలీస్ కమిషనరేట్ అంబర్‌పేట కార్ హెడ్‌క్వార్టర్స్‌లో సీపీ సుధీర్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సీపీ మాట్లాడుతూ..1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనమైన దినాన్ని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ప్రజా పాలన ప్రాముఖ్యత, పారదర్శక పరిపాలన ప్రయోజనాలను వివరించారు.