NLR: కందుకూరులో సీఐ అన్వర్ బాషా లాడ్జి నిర్వాహకులతో సమావేశమై సూచనలు చేశారు. లాడ్జీలలో అసాంఘిక చర్యలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మైనర్లకు గదులు ఇవ్వొద్దని సూచించారు. బస చేసే వారి వివరాలు రిజిస్టర్లో నమోదు చేసి పోలీసులకు అందజేయాలని ఆదేశించారు. టౌన్ ఎస్ఐ శివనాగరాజు పాల్గొన్నారు.