ఆసియాకప్‌లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆఫ్గాన్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 3, తస్కిన్ 2 వికెట్లు చొప్పను పడగొట్టారు.