SDPT: వర్గల్ మండలం గౌరారంలో అనాథలైన ఇద్దరు చిన్నారులకు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్‌రెడ్డి రూ. 30 వేల ఆర్థిక సహాయం చేశారు. 12 ఏళ్ల లోపు నైనిక, అక్షయ్‌లు గతంలో తల్లి, అమ్మమ్మని కోల్పోగా, అనారోగ్యంతో తండ్రి మంజునాథ్ మృతి చెందాడు. ఈ విషయం తెలిసి వంటేరు ప్రతాప్‌రెడ్డి వారిని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశాడు.