AP: ప్రజలకు లాభదాయకమైన సంస్కరణలు కేంద్రం తీసుకొస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి బాటలు వేస్తాయన్నారు. అల్పాదాయ వర్గాలకు జీఎస్టీ తగ్గింపు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. సామాన్యులు వినియోగించే ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజారోగ్య సంరక్షణకు తాజా సంస్కరణలు ఉపయోగపడతాయని చెప్పారు.