WGL: గ్రామాల అభివృద్ధి బీజేపీ పార్టీతోనే సాధ్యం అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణాప్రతాప్ రెడ్డి అన్నారు. గురువారం నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరగా ఆయన పార్టీ కండువానుకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ పాలనకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు.