కోనసీమ: జిల్లాలోని రహదారుల పరిస్థితిని కలెక్టర్ మహేష్ కుమార్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అమరావతిలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సమావేశంలో భాగంగా మంగళవారం ఆయన మాట్లాడారు. కోనసీమలో భూమి అధిక తేమ శాతాన్ని కలిగి ఉండటంతో గట్టితనం లోపిస్తుందన్నారు. రోడ్లు.. నిర్మించిన నాలుగేళ్లకే పాడవుతున్నాయని, క్వాయర్ మ్యాట్లను వినియోగించాలని తెలిపారు.