HYD: నాగార్జునసాగర్ రింగ్ రోడ్డు-శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రాకపోకలు సాగించేవారికి సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం మరో 5 ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, RUBల నిర్మాణాలకు GHMC సిద్ధమవుతుంది. TKR కమాన్, ఒమర్ హోటల్, బండ్లగూడ, మైలార్ దేవ్ పల్లి, ఆరాంఘర్ ప్రాంతాల్లో నిర్మించనున్నారు. త్వరలోనే ఫీజిబిలిటీ స్టడీ, DPRలు పూర్తి చేసి పనులు చేపట్టనున్నట్లు సంబంధిత ఇంజనీర్లు తెలిపారు.