ATP: బెంగళూరులోని డా.బాబు రాజేంద్ర ప్రసాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో సెంట్రల్ సిల్క్ బోర్డు 76వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. అనంతపురం ఎంపీ జి.అంబికా లక్ష్మీనారాయణ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి పురస్కారాలు అందజేశారు. పట్టు పరిశ్రమ అభివృద్ధికి మరింత మద్దతు ఇవ్వాలని, రైతులకు ప్రోత్సాహకాలు పునరుద్ధరించాలని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.