CTR: పెద్దపంజాని మండలం రాయలపేటకు చెందిన బెట్టింగ్ యాప్ నిర్వాహకుడిపై శనివారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాయలపేటకు చెందిన చంద్రబాబు బెట్టింగ్ యాప్ నిర్వహిస్తూ యువకులను ఉచ్చులోకి దింపాడు. గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ బెట్టింగ్ యాప్ ద్వారా తన ఖాతాలో రూ.2 లక్షలు పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.