అన్నమయ్య: పీలేరు మండలం కడప రోడ్డులో చికెన్ సెంటర్ నడుపుతున్న షేక్ ముబారక్(25) లోన్ యాప్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అప్పుల వసూళ్ల పేరుతో భార్య ఫోనుకు అసభ్యకర ఫోటోలను పంపించినందుకు మనస్థాపానికి గురై అతను షాపులో ఎలుకల మందు తాగినట్లు తెలిసింది. కాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.