TG: విద్యుత్ శాఖపై CM రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త డిస్కం ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను అధికారులు రేవంత్‌కు వివరించారు. అయితే ప్రస్తుతం ఉన్న 2 డిస్కంలను మూడుగా పునర్విభజన చేయాలని రేవంత్ సూచించారు. క్యాబినెట్ ఆమోదం తర్వాత కొత్త డిస్కం ఏర్పాటు జరుగుతుందని, దీనిపై పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో Dy.CM భట్టి కూడా పాల్గొన్నారు.