WGL: ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఆలయల అభివృద్ధికి సహకరించాలని కడియం కావ్య, సీఎం రేవంత్ రెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. భద్రకాళి, వేయి స్తంభాలు, చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకానికి సహకరించాలని, వీలైనంత త్వరగా ఆలయాల అభివృద్ధిపై చర్చించాలన్నారు. అవసరమైన నిధులను మంజూరు చేసే విధంగా చూడాలని సీఎంను ఎంపీ కోరారు.