BDK: విద్యార్థులు చదువుతోపాటు కళలలో కూడా రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో ఇవాళ రెండు రోజుల పాటు జరగనున్న జిల్లా స్థాయి కళా ఉత్సవం పోటీలను ప్రారంభించి మాట్లాడుతూ.. చిన్నతనంలో తనకు కూడా కళల పట్ల ఆసక్తి ఉండేదని, సంగీత ఉపాధ్యాయురాలు అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు.