KRNL: DHPS జిల్లా కార్యదర్శి సి. మహేశ్ ఇవాళ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోనేటి రంగారావు భూ సిఫారసు అమలు, NSFDC నిధుల విడుదలకు కేంద్రాన్ని కోరారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సీపీఐ సహాయ కార్యదర్శి మునేప్ప, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.