KMM: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగర మేయర్ పునకొల్లు నీరజ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, తుమ్మల యుగంధర్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.