HYD ప్లేట్ల బురుజు CAR పోలీస్ కేంద్రం వద్ద పోలీస్ పిల్లల కోసం చైల్డ్ కేర్ సెంటర్ ప్రారంభించినట్లు కమిషనరేట్ సిపి ఆనంద్ తెలియజేశారు. సుమారుగా రూ.5 కోట్ల CSR నిధులతో చేపట్టారని, సుమారుగా 1500 నుంచి 2500 మంది పిల్లలకు అకామిడేషన్ కల్పించే విధంగా ఉన్నట్లు వివరించారు. ముఖ్యంగా డ్యూటీలో ఉండే మహిళా పోలీస్ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.