KKD: పశువులకు గాలికుంటువ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని AMC ఛైర్మన్ బద్ది మణి రామారావు, క్లస్టర్ ఇంఛార్జ్ బద్ది వెంకటరమణ పేర్కొన్నారు. శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామంలో శుక్రవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.