AP: ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోలేదని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. NTR వైద్యసేవ పేరుతో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలో రూ.25 లక్షల వరకు సేవలు అందిస్తామని అన్నారు. కోటీ 43 లక్షల మందికి రూ.25 లక్షల బీమా ప్రయోజనం కలగనుందని చెప్పారు. ఇప్పటికే రూ.3,732 కోట్లను నెట్వర్క్ ఆసుపత్రులకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రూ.557 కోట్ల బకాయిలు మాత్రమే ఉన్నాయన్నారు.