TG: BRS నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని KTR వ్యాఖ్యానించారు. తమ పాలన అద్భుతంగా ఉందనుకుంటే వెంటనే ఉపఎన్నికలు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలన ఎలా ఉందో ఉపఎన్నికల ఫలితాల్లో తెలిసిపోతుందన్నారు. ఇక జనంలోకి ఎప్పుడు రావాలో కేసీఆర్కు తెలుసని, రావాల్సిన సమయంలో తప్పక వస్తారని KTR స్పష్టం చేశారు.