KDP: బ్రహ్మంగారిమఠంలో ఈనెల 22 నుంచి వచ్చేనెల 2 వరకు దసర పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ ఈశ్వర చారి శుక్రవారం తెలిపారు. ఇందులో భాగంగా ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు విరివిగా హాజరుకావాలని పిలుపునిచ్చారు. కాగా, ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వివరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూ లైన్లు, సదుపాయాలపై దృష్టి పెట్టామన్నారు.