VZM: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపులు, మహిళల భద్రతపై విద్యార్ధులకు విశ్వవిద్యాలయం అధ్యావకులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ సౌమ్యాలత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీనివాసన్ అదనపు ఎస్పీకి పుష్పగుచ్ఛం ఇచ్చి, మోమెంట్తో బహుకరించారు.