SDPT: జిల్లాలో నివాసయోగ్యమైన రెండు పడక గదుల ఇళ్లలో ఎంపిక చేసిన లబ్ధిదారులు మాత్రమే నివాసం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో 2 BHK ఇళ్ల మంజూరు, లబ్ధిదారులకు ఇళ్ల అప్పగింత, ఇతర ప్రగతి పనులపై తహసీల్దార్, మున్సిపల్, హౌసింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.