NLR: ఉదయగిరి యాదవపాలెం వాసి చెనికల తిరుపతయ్య నెల్లూరు రంగనాయకుల పేట రైల్వే గేట్ సమీపంలో బుధవారం రైలు కిందపడి మృతి చెందారు. అనారోగ్యంతో నెల్లూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, బుధవారం మధ్యాహ్నం రైలు కింద పడి మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతుని ఆధార్ కార్డు ఆధారంగా రైల్వే సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.