పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరులకు ఉద్యమకారులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గుండేటి ఐలయ్య యాదవ్ ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యాన్ని వివరించారు.