NLR: సంగం మండలం పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులను నెల్లూరులో ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌తో పాటు దాని ఓనర్‌పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్కరికి రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కాకాణి డిమాండ్ చేశారు.