SRPT: కోదాడ పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు నారపరాజు వెంకట సత్యనారాయణ, గురువారం తెల్లవారుజామున అనారోగ్యంతో కోదాడ పట్టణంలోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన కోదాడ డివిజన్లోని పలు గ్రామాల్లో, ఉపాధ్యాయుడిగా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన మృతి పట్ల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీతారామయ్య సంతాపం తెలిపారు.