NLR: ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక నవరాత్రి మహోత్సవాలు ఈనెల 22వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. 22న బాలా త్రిపుర సుందరీ దేవి అలంకరణ, 23 అన్నపూర్ణాదేవి, 24 లలితా దేవి, 25 ధనలక్ష్మి దేవి, 26 చాముండేశ్వరి దేవి, 27 మహాలక్ష్మి దేవి, 28 గాయత్రీ దేవి, 29 సరస్వతి దేవి, వచ్చే నెల 2న రాజరాజేశ్వరి అలంకరణ ఉంటుందని తెలిపారు.