GNTR: ఈ నెల 22వ తేదీన మంగళగిరిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సంజీవరావు తెలిపారు. మంగళగిరిలోని VTJM, IVTR డిగ్రీ కాలేజీలో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని చెప్పారు. జాబ్ మేళాలో 10 కంపెనీలు హాజరవుతాయని గురువారం తెలిపారు.10వ తరగతి, డిప్లమో, ITI, డిగ్రీ, ఇంటర్, చదివినవారు అర్హులన్నారు.