TG: ప్రయాణికులకు TGSRTC గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు 7,754 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు RTC అధికారులు వెల్లడించారు. దసరా, బతుకమ్మ పండగల సందర్భంగా హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్లు MGBS, JBS, LBనగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్ నగర్, KPHB వంటి రద్దీ ప్రదేశాల నుంచి బస్సులు నడిపించనున్నట్లు పేర్కొన్నారు.