AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొండాపురం వద్ద మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కువ వాహనాల్లో వస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని తెలిపారు. ఈ క్రమంలో కేతిరెడ్డి వాగ్వాదానికి దిగగా.. నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కేతిరెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లికి పంపించారు.