ASR: కొయ్యూరు మండలం రేవళ్ల శివారులలో నాటుసారా విక్రయాలు చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశామని మంప ఎస్సై కే.శంకరరావు తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా, నాటుసారా విక్రయిస్తున్న రేవళ్లకు చెందిన పిట్టం రాంబాబు పట్టుబడ్డాడన్నారు. అతడిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 70లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామన్నారు.