BDK: సారపాక పంచాయతీ పరిధిలోని మసీదు ఏరియాలో నివాసం ఉంటున్న నవ్య శ్రీ (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని ఎస్సై మేడ ప్రసాద్ బుధవారం వెల్లడించారు. అనారోగ్యంగా ఉందని చికిత్స చేయించాలంటూ భర్త శ్రీనివాస్ రావు నవ్య శ్రీ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అప్పటికే మృతి చెందిన నవ్య శ్రీని గుర్తించిన తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.